Advertisement

Updated November 14th, 2020 at 04:00 IST

Happy Diwali quotes in Telugu for greeting family and friends this Diwali

Happy Diwali quotes in Telugu can be a joyful addition to your Diwali 2020 greetings. Celebrate the festival with these wishes for your family and friends.

Reported by: Arpa C
happy diwali quotes in telugu
| Image:self
Advertisement

Searching for Happy Diwali quotes in Telugu?  You can use these following to share warm greetings this festive season. Read below for Happy Diwali quotes 2020 that you can convey to your loved ones or send over social media and apps.

 

Top Happy Diwali Quotes in Telugu

దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం..
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే..
- అందరికీ దీపావళి శుభాకాంక్షలు

 

Also read: Deepika Padukone's Manager Karishma, Who Was Untraceable, Appears At NCB, Summoned Again

 

ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు..
ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం!
- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

 

కురిపించాలి సిరులు పంట..
మీరంతా ఆనందంగా ఉండాలంట..
అందుకోండి మా శుభాకాంక్షల మూట..

 

మీ ఇంట చిరుదివ్వెల కాంతులు..
జీవితమంతా వెలుగులీనాలని ఆకాంక్షిస్తూ..
- అందరికీ దీపావళి శుభాకాంక్షలు

 

దుష్ట శక్తులను పారద్రోలి,
కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే..
వెలుగుల పండుగే దీపావళి.
- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

 

Also read |  Virat Kohli Birthday: Star Batter Creates Another Unthinkable Dream11 IPL Season Record

 

దీప కాంతుల జ్యోతులతో
సిరిసంపద రాసులతో
టపాసుల వెలుగులతో
- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

 

దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు..
సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు..
- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

 

తెలుగింటి లోగిళ్లన్నీ
కార్తీక దీప కాంతులతో వెలుగులీనాలని
అన్నపూర్ణమ్మ ముద్దుబిడ్డ
అన్నదాత కళ్లలో ఆనంద కాంతులు
మెరకవాలని కోరుకుంటూ..

 

అంతరంగంలో అంధకారం అంతరిస్తే..
వ్యక్తిత్వం వెలుగులీనుతుంది..
జీవితం ఆనంద దీపావళిని ప్రతిఫలిస్తుంది.
- మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు

 

దీపావళి దివ్వకాంతుల వేళ
శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా
మీకు, మీ కుటుంబ సభ్యలందరికీ
సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం
ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ..

 

దీపావళి పండగ పేరు గుర్తుకు రాగానే వెంటనే మనసులో మెదిలేది దీపాల వెలుగులు, టపాసుల చప్పుడ్లు & అందాల బొమ్మల కొలువులు సందడ్లు. అలాంటి దీపావళి పండుగని మనము ఎందుకు జరుపుకుంటాము అని అంటే, అందుకు కారణంగా రెండు రకాలైన సంఘటనలు చెబుతుంటారు.

 

అందులో ఒకటి శ్రీకృష్ణుడికి - నరకాసురుడికి జరిగిన యుద్ధంలో నరకాసురుడిని.. సత్యభామ సంహరించడంతో ప్రజలు ఆనందోత్సాహాలని దీపాలతో జరుపుకోగా అది దీపావళి పండుగకి అంకురార్పణ జరిగింది. ఇంకొకటి ఏంటంటే - సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని అంతమొందించి రాముడు తన భార్య & తమ్ముడితో కలిసి అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంగా అయోధ్య ప్రజలు తమ ఆనందాన్ని పండుగ రూపంలో జరుపుకోగా అదే దీపావళి అయిందని చెబుతుంటారు.

 

Also read: Rupee Soars 47 Paise To 74.29 Against US Dollar In Early Trade

 

More Happy Diwali Quotes 2020 in Telugu

అలా ఈ రెండు నేపధ్యాల కారణంగా దీపావళి పండుగకి అంకురార్పణ జరిగింది. ఇక ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా ఇంటిలో పిండి వంటలు, తీపి పదార్ధాలు చేసి వాటిని దేవుడికి నైవేధ్యంగా పెట్టడం జరుగుతుంటుంది. అలాగే ఈ దీపావళి సందర్భంగా చాలామంది భక్తులు లక్ష్మి పూజ చేస్తుంటారు. లక్ష్మి దేవి తమ పట్ల కరుణ చూపాలని ప్రార్ధించే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఇక చిన్న పిల్లలు ఎక్కువగా టపాసుల పండుగగానే ఈ దీపావళి పండుగని చూస్తారు. టపాసులు పేల్చుతూ దీపావళి రోజున ఆనందంగా గడుపుతుంటారు.

 

ఇక ఈ వెలుగుల పండుగ సందర్భంగా మీ ఆత్మీయులకు, బంధువులకి & సామజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలిపేందుకు కావాల్సిన సందేశాల్ని & కొటేషన్స్ ని ఈ క్రింద తెలపడం జరిగింది. ఒకసారి ఈ క్రింద చూడవచ్చు.

 

మీ అందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు

 

ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

 

Also read: Raveena Tandon Celebrates Karwa Chauth Away From Husband; Looks Resplendent In Red

 

ఈ దీపావళి సందర్భంగా వెలిగించే దీపాల వెలుగులు మీకు జీవితంలో సరైన మార్గాన్ని చూపెట్టాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

ఇవి దీపావళి పండుగ సందర్భంగా తెలిపే శుభాకాంక్షలు.

 

దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఆ వెలుగుల్లో మీ జీవితాలు మరింత ప్రకాశవంతంగా అవ్వాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

 

These are some Happy Diwali Quotes in Telugu that you can send to your family and friends. Make Diwali brighter by sharing the joy you experience this festive season. With these Happy Diwali 2020 quotes in Telugu, you could convey the special place your loved ones have in your heart.

Advertisement

Published November 14th, 2020 at 04:00 IST

Your Voice. Now Direct.

Send us your views, we’ll publish them. This section is moderated.

Advertisement
Advertisement

Trending Quicks

Advertisement
Advertisement
Advertisement
Whatsapp logo